Pages

మహాభారతం - Mahabharatham



    ఈ లోకంలో అత్యంత ప్రీతికరమైన కథ ఏదన్న ఉంది అంటే అది మహాభారతం. ఎంతో మంది మహానుభావులు కురుక్షేత్రంలో పోరాడి చిరస్తాయిగా నిలిచిపోయిన కథ. ఎన్నో పాత్రలు, ప్రతి ఒక్కరి కథ విడివిడిగా ఉంటుంది. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన కథ ఇది. ఏ కథలో అయిన నాయకుడు ప్రతినాయకుడు ఉంటారు కానీ ఈ కథలో అయిదుగురు నాయకులు వంద మంది ప్రతినాయకులు ఉన్నారు. ఆ వారి కథ మనకు తెలిసిందే కాని మనకు తెలియని కొన్ని కథలు చెప్పడానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. ఇది ఎంత వరకు నిజం ఈ కథ అసలు జరగలేదు అనేదానికంటే ఈ కథ మానవజీవితానికి ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం ఎంతో ఉత్తమం. ఈ మహాభారతాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకం ఉంది.

ధర్మేచ అర్తేచ కామేచ మొక్షేచ భారతర్శభా |
యదిహస్తిత ధన్యత్ర యనేహస్తిన తత్క్వచిత్ | |

    దీని అర్థం ఏంటి అంటే "ఓ భరతా, ఇందులో (మహాభారతంలో) ధర్మం, అర్థము, కామము, మోక్షము అనేవి ప్రతి చోటా ఉన్నాయి. ఇందులో లేనిది ఈ లోకంలో ఎక్కడా లేవు." అని అర్థం వస్తుంది.

కింద ఉన్న టాపిక్స్ (topics) మీద క్లిక్ చేయండి









భరత సంహితం

ఈ భరత సంహితం నేను నా స్నేహితుడు కలిసి ప్రారంభించిన బ్లాగ్. ఇందులో ఎన్నో పురాణాలు వాటి అర్థాలు, మన దేశ విజ్ఞానం ఎలాంటిదో చెప్పడానికి మన ఋషులు ఎన్నో గ్రంథాలను రచించారు. వాటిని అందరికి అందించాలి అన్నదే మా ఈ చిన్న ప్రయత్నం

No comments:

Post a Comment