మహాభారతాన్ని వ్యాసుడు రాశాడు అని తెలుసు. కాని ఆయన ఆ మహాభారతంతో పాటు ఇంకా చాలా వాటిని రచించారు. కలి యుగంలో మానవులు నీతి తప్పి ప్రవర్తిస్తారు కాబట్టి వారికి జ్ఞానాన్ని అందించడానికి అనేక వేదాలను, ఉపనిషత్తులు అన్ని మనకు అందించారు. వ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వ్యాస అంటే సంకలనకర్త (compiler) అని అర్థం. వేదాలను విభజించాడు కాబట్టి ఆయనకు వేదవ్యాసుడు అని పేరు వచ్చింది.
మన అందరికి వ్యాసుడు సత్యవతికి పరాశరుడికి పుట్టినవాడు అని తెలుసు. ఆయన శ్రీమహావిష్ణువు అంశతో పుట్టాడు అని అంటారు. కాని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కృష్ణద్వైపాయనుడు ఉన్న ద్వాపరయుగం 28వ ద్వాపరయుగం. అంటే కృష్ణద్వైపాయనుడు 28వ వేదవ్యాసుడు. మనం ఇప్పుడు 28వ కలియుగంలో ఉన్నాము అని దేవి భాగవతంలో పేర్కొన్నారు. ఇంతకు ముందు 27 చతుర్యుగాలు అయిపోయాయి. ఇది 28వ చతుర్యుగంలోని కలి యుగం.
గడిచిన ద్వాపరయుగాలలో వేదాలను రచించిన ఆ వ్యాసులు ఎవరు అంటే
1. మొదటి ద్వాపర యుగంలో స్వయంభువుడు
2. రెండవ ద్వాపర యుగంలో ప్రజాపతి
౩. మూడవ ద్వాపర యుగంలో ఉశనసుడు
4. నాల్గవ ద్వాపర యుగంలో బృహస్పతి
5. అయిదవ ద్వాపర యుగంలో సవిత (సూర్యుడు)
6. ఆరవ ద్వాపర యుగంలో మృత్యువు
7. ఏడవ ద్వాపర యుగంలో మఘవుడు
8. ఎనిమిదవ ద్వాపర యుగంలో వసిష్ఠుడు
9. తొమ్మిదవ ద్వాపర యుగంలో సారస్వతుడు
10. పదవ ద్వాపర యుగంలో త్రిధాముడు
11. పదకొండవ ద్వాపర యుగంలో త్రివృషుడు
12. పన్నెండవ ద్వాపర యుగంలో భరద్వాజుడు
13. పదమూడవ ద్వాపర యుగంలో అంతరిక్షుడు
14. పద్నాల్గవ ద్వాపర యుగంలో ధర్ముడు
15. పదిహేనవ ద్వాపర యుగంలో త్రయ్యారుణి
16. పదహారవ ద్వాపర యుగంలో ధనంజయుడు
17. పదిహేడవ ద్వాపర యుగంలో మేధాతిథి
18. పద్దెనిమిదవ ద్వాపర యుగంలో వ్రతి
19. పంతొమ్మిదవ ద్వాపర యుగంలో అత్రి
20. ఇరవైయవ ద్వాపర యుగంలో గౌతముడు
21. ఇరవైయొకటవ ద్వాపర యుగంలో ఉత్తముడు
22. ఇరవైరెండవ ద్వాపర యుగంలో వేనుడు
23. ఇరవైమూడవ ద్వాపర యుగంలో సోముడు
24. ఇరవైనాల్గవ ద్వాపర యుగంలో తృణబిందువు
25. ఇరవైఆయిదవ ద్వాపర యుగంలో బార్గవుడు
26. ఇరవైఆరవ ద్వాపర యుగంలో శక్తి
27. ఇరవైఏడవ ద్వాపర యుగంలో జాతుకర్ణ్యుడు
28. ఇరవైఎనిమిదవ ద్వాపర యుగంలో కృష్ణద్వైపాయనుడు
ఇలా ప్రతి ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు వ్యాసుడిగా పుడతాడు.
కలి యుగంలోని మనుషుల కోసం వేదాలకు రచన రూపం ఇస్తాడు. ఇలా మనకోసం మన పూర్వీకుల
పరిజ్ఞానం ఇలా మనకు రచన రూపంలో మనకు అందించారు. కాని మనం ఈరోజు అవే వేదాలు
శాస్త్రాలు ఒట్టి అబద్ధాలు అని, మూడనమ్మకాలు కొట్టిపడేస్తున్నాం.
కాని ఆ పూర్వీకులే శూన్యం అంటే సున్నా (zero) ని కనిపెట్టారు.
ఆ పూర్వీకులే సూర్యుడి చుట్టూ తొమ్మిది గ్రహాలూ తిరుగుతున్నాయి అని చెప్పారు.
ఆ పూర్వీకులే పరిమా అంటే ఇప్పుడు మనం వాడే Pi value. ఇలాంటివి ఎన్నో
ఆవిష్కరణలు చేసి మనకు అందించారు. వాటికి మళ్ళి పూర్వ వైభవం రావాలి అని
కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.
- భరత సంహితం
No comments:
Post a Comment