Pages

పురాణాలు - Puranaas

 


    మనము చిన్నప్పటి నుంచి ఎన్నో పురాణాలు వింటూ వచ్చాము. దేవుళ్ళు, రాక్షసులు, యుద్ధాలు అందులోని పాత్రలు ఎన్నో ఉన్నాయి. కానీ మనకు ఒక వయస్సు వచ్చాక అవి పుక్కిట పురాణాలు అని, దేవుడు అనే వాడే లేడు అని కొట్టి పారేస్తాం. ఆ కథలు ఒక మతానికి సంబంధించిన కథలలా కాకుండా ఒకరి వ్యక్తిత్వం ఎలా ఉంటే దాని పరియవసానాలు ఎలా ఉంటాయి, వాటిలో నీతి ఏంటి, మనిషి ఎలా బ్రతకాలి అని తెలుపుతాయి. రాముడిలో ధర్మమూ, కృష్ణుడిలో లీల, ఒక రాక్షసుడి స్వభావం, స్త్రీ స్వభావం, పురుషుడి స్వభావం ఇంకా ఎన్నో విషయాలు కథల రూపంలో మనకు అందించారు మన పూర్వికులు.

    మనం స్కూల్ లో ఉన్నప్పుడు సుభాషితాలు చదువుకొని ఉంటాం. అందులో ప్రతి పద్యం ఒక జీవిత పాఠమే. అలాగే పురాణ కథలు కూడా మనం చదువుకొని ఉంటాం. ప్రతి కథలో నీతి ప్రతి కథలో ఒక పాఠం కచ్చితంగా ఉంటుంది. ఆ పురాణాల గురించి చెప్పేదే ఈ భరత సంహితం. ఈ విభాగంలో ఎన్నో మనకు తెలియని కథలు వాటి నీతులు ఏంటి అని మనం ఇందులో చూద్దాం.

కింద ఉన్న టాపిక్స్ (topics) మీద క్లిక్ చేయండి

1. గరుత్మంతుడి కథ

2. హయగ్రివుడు

3. మధుకైటభుల కథ



భరత సంహితం

ఈ భరత సంహితం నేను నా స్నేహితుడు కలిసి ప్రారంభించిన బ్లాగ్. ఇందులో ఎన్నో పురాణాలు వాటి అర్థాలు, మన దేశ విజ్ఞానం ఎలాంటిదో చెప్పడానికి మన ఋషులు ఎన్నో గ్రంథాలను రచించారు. వాటిని అందరికి అందించాలి అన్నదే మా ఈ చిన్న ప్రయత్నం

No comments:

Post a Comment