Pages

హయగ్రివుడు - Hayagriva

 

    Image Source : Navhindu

    మనకు శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలు తెలుసు, కానీ ఆ దశావతారాలు కాకుండా ఇంకా కొన్ని అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలలో ఈ హయగ్రీవ     అవతారం ఒకటి. ఈ హయగ్రివుడు, హయగ్రివుడు అనే రాక్షసుడి నుండి వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి అందించాడు. అసలు ఈ హయగ్రివుడు ఎవరు మళ్ళి అదే పేరుతో రాక్షసుడు ఎవరు. హయగ్రీవ అవతారాన్ని ఎందుకు ఎత్త వలసి వచ్చింది అనే విషయాలను మనం ఈ కథలో చూద్దాం.

    పూర్వం హయగ్రివుడు అనే రాక్షసుడు సరస్వతి నది తీరాన ఆదిపరాశక్తిని స్మరిస్తూ ఘోర తపస్సు చేశాడు. ఆ హయగ్రివుడికి గుర్రము తల ఉంటుంది. అతని తపస్సుకు మెచ్చి అమ్మవారు అతనికి దర్శనం ఇచ్చారు. అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పగా ఆ హయగ్రివుడు "నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తల్లి" అని కోరాడు. దానికి అమ్మవారు "ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది. కాబట్టి వేరే వరం కోరుకో" అని చెప్పింది. అందుకు ఆ హయగ్రివుడు "నాకు మరణం అంటూ వస్తే అది హయగ్రివుడి చేతిలోనే రావాలి." అని కోరతాడు. అమ్మవారు తదాస్తు అని అక్కడి నుంచి అదృశ్యం అవుతుంది. ఆ వరగర్వంతో ఆ హయగ్రివుడు వేదాలను దొంగలించాడు. ఋషుల యజ్ఞాలను నాశనం చేసే వాడు.
    
    ఇది ఇలా ఉండగా శ్రీమహావిష్ణువు రాక్షసులతో కొన్ని వేల సంవత్సరాలు పోరాడాడు. అలా విరామం లేకుండా పోరాడటం వల్ల అలిసిపోయి తన ధనస్సు పైభాగం మీద తల పెట్టి నిలబడి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో దేవతలు ఒక యజ్ఞాన్ని ఆరంభించాలి అని తలచి విష్ణువు దగ్గరికి వచ్చారు. విష్ణువు నిద్ర పోవడం గమనించిన బ్రహ్మ, విష్ణువును నిద్రలేపడానికి ఒక పథకం వేశాడు. రెండు చేద పురుగులను సృష్టించాడు, ఆ రెండు పురుగులు వెళ్ళి విష్ణువు ధనుస్సు కింద ఉన్న దారాన్ని తిని తెగేల చేసాయి. ఒక పెద్ద శబ్దంతో ఆ ధనస్సు విరిగింది. ఇది ఏంటి అని విష్ణువును చూడగా ఆయన తల తెగి సముద్రంలో పడిపోయింది.

    ఈ పరిస్థితిలో బ్రహ్మకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు, వెంటనే బ్రహ్మ అమ్మవారికి ప్రార్థన చేశాడు. అప్పుడు అమ్మవారు ఆకాశవాణిగా వినిపించింది, "దేవతలారా! ఈ పరిణామానికి ఒక అర్థం ఉంది." అని హయగ్రివుడి కథను చెప్పి "ఇలా ఆ రాక్షసుడిని సంహరించడానికి ఆ మాహావిష్ణువు హయగ్రివుడిగా అవతారం ఎత్తవలసిన సమయం ఇదే. మీరు ఒక గుర్రం తలను తీసుకు వచ్చి దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిచి విష్ణువు మొండానికి ఆ గుర్రపు తలను అతికించండి. తరువాత సంగతి ఆ మహావిష్ణువే చూసుకుంటాడు" అని చెప్పి వెళ్ళిపోయింది.

    దేవతల శిల్పి అయిన విశ్వకర్మ వచ్చి ఒక గుర్రపు తలను తీసుకొని వచ్చి ఆ మహావిష్ణువు మొండానికి అతికించాడు. ఆ మహావిష్ణువు జరిగినది అంతా తెలుసుకొని ఆ హయగ్రివుడితో యుద్ధానికి వెళతాడు. ఆ హయగ్రివుడితో భీకరయుద్ధం చేసి వేదాలను కాపాడి తిరిగి బ్రహ్మకు అందించాడు ఆ హయగ్రివుడు. ఇలా హయగ్రివుడు, హయగ్రివుడి చేతిలో హతం అయ్యాడు.

    ఎలాంటి వరాలు కోరుకున్నప్పటికి మరణం లేదు అని అనుకున్నారు ఆ రాక్షసుడు. హిరణ్యకశిపుడు కూడా తనకు మరణం లేదు అనే అనుకున్నాడు. తరువాత తను కోరిన వరాలకు తగ్గట్టుగానే నరసింహ అవతారం చేత చంపబడ్డాడు. వారు వారికి ఉన్న వరాలను చెడుకు కాకుండా మంచిగా ఉపయోగించి ఉండి ఉంటే వాళ్ళకు నిజంగా మరణం ఉండేది కాదు కొన్ని యుగాల వరకు. ఇంతటితో ఈ హయగ్రివుడి కథ సమాప్తం. స్వస్తి.

- భరత సంహితం



No comments:

Post a Comment