1. ధృతరాష్ట్రుడు పలికెను : సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధ కాంక్షతో నా పుత్రులు అయిన దుర్యోధనాదులు, పాండు పుత్రులు అయిన యుధిష్ఠిరాదులు కలిసి ఏమి చేసారు?
2. సంజయుడు పలికెను : అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహబద్దమైన
పాండవ సైన్యాన్ని చూసి, ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి ఇలా పలికాడు.
3. గురుదేవా! బుద్ధిమంతుడు, మీ శిష్యుడు, ద్రుపదపుత్రుడు అయిన
ధృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని విరచించాడు, పాండవుల ఈ విపులసైన్య సమావేశాన్ని
చుడండి.
4 - 6. ఈ పాండవసేనలో యుద్ధములో భీమార్జునులతో సరితూగగల సాత్యకి, విరాటరాజు, మహారథుడైన ద్రుపదుడు, శిశుపాలుని పుత్రుడైన ద్రుష్టకేతువు, యడువంశీయవీరుడైన చేకితానుడు, శక్తిశాలియైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు, పరాక్రమశాలియైన యుధామన్యుడు, మహాశాక్తిశాలియైన ఉత్తమౌజుడు, సుభద్రాసుతుడైన అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులైన ఉపపాండవులు మొదలైన మహాధనుర్ధరులైన వీరులు ఉన్నారు. వీరందురూ మహారథులు.
7. విప్రవర్యా! మన పక్షాన ఉన్న ప్రసిద్ధ యోధులను సేనాపతులను
తెలుసుకోండి. మీకు తెలియజేడానికై వారి పేర్లను చెపుతున్నాను.
8. మనపక్షాన మీరు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడైన
కృపాచార్యుడు, అలాగే అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన
భూరిశ్రవుడు మొదలైన ప్రముఖులు ఉన్నారు.
9. నా నిమిత్తం ప్రాణాన్ని సైతం త్యజించడానికి
సంసిద్ధులైనవారు ఇంకా అనేకమంది ఉన్నారు. వీరందరూ వివిధశస్త్ర ధరులైన
సంపన్నులు, యుద్ధ నిపునులును.
10. భీష్మపితామహునిచే రక్షించాపడుతున్న మన సైన్యబలం
పరిమితం, భీమునిచే రక్షిమ్పబడుతున్న పాండవసైన్యం అపరిమితమైనది.
(కౌరవుల సైన్యసంఖ్య పాండవుల సైన్యసంఖ్య కన్నా
అధికమైనా, తద్వ్యతిరేకంగా చెప్పబడింది. ఎందుకంటే భీశామపితామహుడు
ఉభాయపక్షపాతి, భీముడు ఎకపక్షపాతి. కనుక బలం పాండవుల వైపుకే
మ్రొగ్గుతోంది.)
11. (అందువల్ల మీరీవిధంగా చేయకండి) కనుక మీరందరూ
సైన్య సమూహాల వ్యుహద్వారాలలో యథా స్థానంలో ఉండి,
భీష్మపితామహుణ్ణి రక్షించండి. (భీష్ముని బలమే మన ప్రాణాలను
కాపాడుతుంది)
12. (సమానపూర్వకమైన దుర్యోధనుని వాక్యాలను
విని) కురుకుల వృద్ధుడు, ప్రతాపశీలి, పితామహుడు అయిన భీష్ముడు
పెద్దగా సింహగర్జన చేసి, శంఖాన్ని పూరించాడు. దుర్యోధనుని
హృదయం హర్షపూర్నమయ్యింది.
13. (భీష్ముని యుద్ధోత్సాహం సర్వత్రా
యుద్ధోత్సాహాన్ని పురికొల్పింది.) శంఖాలు, భేరులు, డోళ్ళు,
మృదంగాలు, రణశృంగాలు ఒక్కసారిగా మ్రోగసాగాయి. ఆ ధ్వనులు
కలిసిపోయినవి.
14. పిదప తెల్లని గుఱ్ఱాలు పూన్చిన
ఉత్తమరథంలో కూర్చున్న శ్రీకృష్ణుడు, పాండుకుమారుడైన
అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు.
15. హృషీకేశుడు(శ్రీకృష్ణుడు) పాంచజన్యం
అనే శంఖాన్ని, ధనంజయుడు(అర్జునుడు) దేవదత్తమనే శంఖాన్ని,
ఘోరకర్ముడైన భీష్ముడు పౌండ్రమనే శంఖాన్ని
పూరించారు.
16. కుంతీతనయుడైన ధర్మరాజు అనంతవిజయమనే శంఖాన్ని, నకుల-సహదేవులు సుఘోష-మణిపుష్పకాలనే శంఖాలను పూరించారు.
17-18. ఓ దృతరాష్ట్ర భూపతీ! మహాధనుర్ధరుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదరాజు, ద్రౌపదీ తనయ పంచకము, మహాభుజుడైన అభిమన్యుడు మొదలైనవారు నలువైపుల నుండి తమతమ శంఖాలను విడివిడిగా పూరించారు.
19. ఆ భీకర శంఖధ్వనులు భూనభొంతరాలలో ప్రతిధ్వనించి దుర్యోధనాదుల హృదయాలను అదరగొట్టాయి.
20. ఓ మహీపతీ! అప్పుడు కపిధ్వజుడైన (ధ్వజంపై హనుమంతుని గుర్తు కలిగిన) అర్జునుడు యుద్ధసంసిద్ధులైన దృతరాష్ట్ర పుత్రులను చూసి, విల్లునెత్తి శ్రీకృష్ణునితో ఇలా పలికాడు.
21-23. అర్జునుడు పలికెను: నేను యుద్ధం చేయగోరి వచ్చిన వీరందరినీ చూస్తాను. ఈ మహాయుద్ధంలో ఎవరెవరితో పోరాడవలసి ఉందో గ్రహించి, దుర్బుద్ధి అయిన దుర్యోధనుని ప్రియకాములైన ఏ వీరపురుషులు యుద్ధం చేయడానికి ఈ కురుక్షేత్రానికి అరుదెంచారో వారిని చూడాలి. కాబట్టి, శ్రీకృష్ణా! ఉభయ సైన్యానికి మధ్యలో నా రథాన్ని నిలుపు.
24-25. సంజయుడు పలికెను : ఓ దృతరాష్ట్రా! గుడాకేశుడైన అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధంగా చెప్పగా, శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య, భీష్మద్రోణులు తదితరులైన మహీపతుల సమ్ముఖాన రథోత్తమాన్ని నిలిపి, "పార్థా! యుద్ధం చేయడానికి సమావేశమైన ఈ కౌరవులను చూడు!" అని పలికెను.
26-27. అప్పుడు పార్థుడు రెండు సేనలలో ఉన్న భూరిశ్రవాది పితృసమానులను, భీష్ముడు మొదలుగాగల పితామహులను, ద్రోణుడు మున్నగు ఆచార్యులను, శల్యాదులైన మేనమామలను, దుర్యోధనాదులైన సోదరులను, లక్ష్మనాదులైన పుత్రస్థానీయులు, పౌత్రులను అశ్వత్థామాది మిత్రగణాన్ని, కృతవర్మాదులైన ఆత్మీయులను గాంచాడు.
27-28. అర్జునుడు అచటనున్న బంధువులనందరిని గాంచి, అత్యంత దయార్ధ్రచితుడై దుఃఖిస్తూ ఈ విధంగా పలికాడు.
28-29. అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! యుద్ధార్థమై అరుదెంచిన బంధువులను చూసి, నా అవయవాలన్నీ పట్టు తప్పిపోతున్నాయి, నోరు ఎండుతోంది. నా శరీరం వణుకుతోంది, రోమాలు నిక్కపోడుచుకున్నాయి, చేతి నుండి గాండీవం జారిపోతుంది, చర్మం దగ్థమవుతున్నట్లుగా ఉంది.
30. కేశవా! నేనింక స్థిరంగా ఉండజాలకున్నాను. నా మనస్సు చంచలమగుచునట్లుగా ఉండి, అమంగళ సూచకాలైన అపశాకునాలను నేను చూస్తున్నాను.
31. కృష్ణా! యుద్ధంలో బంధువులను చంపడం వాళ్ళ ఒరిగే శుభాన్ని గ్రహించలేకున్నాను. యుద్ధంలో జయాన్ని గాని, రాజ్య-సుఖభోగాలు గాని నేను కోరడం లేదు.
32-34. గోవిందా! మనకు రాజ్యంతోగాని, సుఖభోగాలతో గాని, జీవితంతో గాని ప్రయోజనమేముందు? ఎందుకంటే, ఎవరి కోసం మనం రాజ్యాన్ని, భోగాలను సుఖాలను ఆకాంక్షిస్తున్నామో, ఆ గురువులు, తండ్రులు, పుత్రులు, పితామహులు, మేనమామలు,మామలు, మనుమలు, బావలు, ఇతర బంధువులు ధనప్రాణాలపై ఆశను వదిలి ఈ యుద్ధానికి అరుదెంచారు.
35. ఓ మధుసూదనా! నన్ను వీరు వధించినా, నాకు వీరిని చంప ఇష్టం లేదు. పృథ్వీ మాటేమి, త్రిలోకరాజ్యాన్ని పొందడానికైనా కూడా వీరిని చంపను.
36. జనార్దనా! దుర్యోధనాదులను చంపడం వల్ల మనకు కలిగే సంతోషం ఏమిటి? ఈ ఆతతాయుల నందరిని చంపడం వల్ల మనకు లభించేది పాపమే!
37. కాబట్టి, దుర్యోధనాదులను, వారి బంధువులను చంపడం మనకు తగదు. మాధవా! స్వజనులను చంపి మనమెలా సుఖించగలం?
38-39. వీరు రాజ్యలోభం కారణంగా వివేకాన్ని త్యజించి, కులక్షయం వల్ల కలిగే దోషాన్ని, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని గ్రహించలేకున్నారు. జనార్దనా! వంశానాశం వల్ల కలిగే దోషాన్ని గుర్తిస్తున్న మనం ఈ పాపం నుండి వివర్తిల్లడానికి తెలియని వారం ఎలా కాగలుగుతాం?
40. కులనాశనం వల్ల సనాతనమైన కులధర్మాలు వినష్టమవుతాయి; ధర్మం నశిస్తే, కులమంతా అనాచార మాయమయ్యే అధర్మంతో కప్పబడిపోతుంది.
41. కృష్ణా! అధర్మక్రమాణం వల్ల కులస్త్రీలు వినష్టలవుతారు; ఓ వృష్ణికుల సంభవా! కులస్త్రీలు చెడిపోతే వర్ణసంకరం అవుతుంది.
42. వర్ణసంకరమైతే కులఘాతకులు, కుల జనులంతా కూడా నరకంలో పడవేయబడుతున్నారు; శ్రాద్ధతర్పణ క్రియలు లోపించడం వల్ల వారి పితృపురుషులు కూడా నరకంలో పడుతున్నారు.
43. వర్ణసంకర కారణాలైన ఈ దోషాల వల్ల, కులఘాతకుల వల్ల సనాతన వర్నధర్మాలు, కులధర్మాలు, ఆశ్రమధర్మాలు, ఉత్సన్నమవుతున్నాయి. (సమూలంగా నశించినవి అవుతున్నాయి)
44. జనార్ధనా! కులధర్మ భ్రష్టులు తప్పక నరకంలో నివసిస్తారు ఇది మనం ఆచార్య పరంపరా క్రమంలో విన్న విషయం.
45. అయ్యో! మనమెంత మహాపాపాన్ని చేయ పూనుకున్నాం! ఎందుకంటే రాజ్యం వల్ల కలిగే సుఖాశచేత బంధువులను చంప ఒడిగట్టామే!
46. ప్రతిఘటించకుండా, నిరాయుధుడనై ఉన్న నన్ను శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్ధంలో చంపినా చంపుతారు గాక! ఆ చావు ఇంతకంటే మేలే అవుతుంది.
47. సంజయుడు పలికెను : అర్జునుడు ఇలా పలికి, ఎక్కుపెట్టిన విల్లును వీడి, శోకతప్తచిత్తుడై రథమధ్యంలో కూలబడ్డాడు.
అర్జున విషాదయోగం ముగిసింది
No comments:
Post a Comment